ePaper
More
    HomeతెలంగాణMeenakshi Natarajan Padayatra | తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. ఏయే జిల్లాల్లో సాగనుందంటే..

    Meenakshi Natarajan Padayatra | తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. ఏయే జిల్లాల్లో సాగనుందంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్​ (in-charge Meenakshi Natarajan) పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో క్యాడర్​లో ఉత్సాహం నింపడం, పార్టీని బలోపేతం చేయడం కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను (Padayatra schedule) పార్టీ వర్గాల విడుదల చేశారు. ఆమె పాదయాత్ర రంగారెడ్డి, మెదక్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​ జిల్లాల్లో సాగనుంది.

    Meenakshi Natarajan Padayatra | పాదయాత్ర షెడ్యూల్ ఇదే..

    మీనాక్షి నటరాజన్ పాదయాత్రను (Meenakshi Natarajan Padayatra) వారం రోజుల పాటు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. పాదయాత్రలో భాగంగా శ్రమదానం కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వికారాబాద్ జిల్లాలోని (Vikarabad district) పరిగి నుంచి ఈ నెల 31 పాదయాత్ర ప్రారంభం కానుంది. ఒకటో తేదీన కూడా అక్కడే సాగనుంది. 2వ తేదీన మెదక్​ జిల్లా ఆంధోల్, 3వ తేదీన నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) ఆర్మూర్, 4వ తేదీన ఆదిలాబాద్​ జిల్లా ఖానాపూర్, 5వ తేదీన కరీంనగర్​ జిల్లా చొప్పదండి, 6వ తేదీన వరంగల్​ జిల్లా వర్ధన్నపేట వంటి నియోజకవర్గం పాదయాత్ర సాగనుంది.

    READ ALSO  Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    Meenakshi Natarajan Padayatra | పార్టీ కేడర్​లో ఉత్సాహం నింపేందుకు..

    పార్టీ కేడర్​లో ఉత్సాహం నింపేందుకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను (welfare schemes) ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ (BRS and BJP) వంటి ప్రతిపక్ష పార్టీల నుంచి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచాలని భావిస్తున్నారు. అంతేకాకుండా కార్యకర్తల్లో ఐక్యత, ఉత్సాహం పెంచేందుకు యాత్ర చేస్తన్నటు తెలుస్తోంది.

    Meenakshi Natarajan Padayatra | పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు..

    తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాల ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్లలేదని భావన పార్టీలో ఉంది. అంతేకాకుండా కుల గణన అంశాన్ని కూడా అనుకున్నంతగా క్షేత్రస్థాయిలోకి నాయకులు, కార్యకర్తలు తీసుకువెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలతో నేరుగా సంభాషించే అవకాశం ఉన్న పాదయాత్ర దోహదం చేస్తుందని భావించి పాదయాత్ర చేపట్టినట్లు సమాచారం.

    READ ALSO  Sirikonda Mandal | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​.. గడ్కోల్ గ్రామంలో పలు ఇళ్లలో చోరీ

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...