ePaper
More
    Homeబిజినెస్​Stock Market | కోలుకోని మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

    Stock Market | కోలుకోని మార్కెట్లు.. నష్టాలతో ముగిసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | వాణిజ్య ఒప్పందాల విషయంలో యూఎస్‌ అధ్యక్షుడు ఇచ్చిన చివరి గడువు సమీపిస్తుండడం, ఇప్పటికీ భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఇన్వెస్టర్లలో అనిశ్చితిని పెంచుతోంది.

    ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణులు, ముడి చమురు ధరలు పెరుగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, క్యూ1 ఎర్నింగ్‌ సీజన్‌ అంత ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో మార్కెట్‌ పతనమవుతోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 164 పాయింట్ల నష్టంతో ప్రారంభమెన అక్కడినుంచి మరో 206 పాయింట్లు క్షీణించింది. అక్కడినుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 464 పాయింట్లు పెరిగింది.

    ఉదయం 55 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 50 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కోలుకుని 157 పాయింట్లు పెరిగింది. అయితే మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 572 పాయింట్ల నష్టంతో 80,891 వద్ద, నిఫ్టీ(Nifty) 156 పాయింట్ల నష్టంతో 24,680 వద్ద స్థిరపడ్డాయి. టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

    విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా వంటి స్టాక్స్‌ గణనీయమైన నష్టాలను చవిచూశాయి.
    యూఎస్‌ సుంకాల ప్రభావం, అనిశ్చితుల కారణంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ భారత్‌ జీడీపీ(GDP) వృద్ధి అంచనాలను FY26కు 6.7 శాతంనుంచి 6.5 శాతానికి తగ్గించడమూ మన మార్కెట్లలో పతనానికి కారణంగా నిలిచింది. చాలా కాలంగా తక్కువ స్థాయిలలో కనిపిస్తున్న విక్స్‌(VIX) రెండు రోజులుగా పెరుగుతోంది. రెండు రెజుల్లో 12 శాతం వరకు పెరిగింది. ఇది మార్కెట్‌లో నెలకొన్న భయాలను సూచిస్తోంది.

    బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,256 కంపెనీలు లాభపడగా 2,881 స్టాక్స్‌ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 125 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 89 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 8 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. మూడు సెషన్లలోనే సెన్సెక్స్‌ 2.2 శాతం, నిఫ్టీ ఫిఫ్టీ 2.1 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీల విలువ మూడు సెషన్లలోరూ. 12 లక్షల కోట్లకుపైగా క్షీణించింది.

    Stock Market | అన్ని రంగాల్లో సెల్లాఫ్‌..

    యుటిలిటీ(Utility), ఎఫ్‌ఎంసీజీ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు ఊచకోతకు గురయ్యాయి. బీఎస్‌ఈ యుటిలిటీ ఇండెక్స్‌ 0.16 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.12 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్‌(Realty index) 4.11 శాతం పతనమైంది. టెలికాం 1.56 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.49 శాతం, బ్యాంకెక్స్‌ 1.35 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 1.18 శాతం, పీఎస్‌యూ, మెటల్‌ ఇండెక్స్‌లు 1.06 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.31 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.73 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.63 శాతం నష్టాలను చవిచూశాయి.

    Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో, 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌యూఎల్‌ 1.23 శాతం, ఆసియా పెయింట్‌ ఒక శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.82 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.43 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.18 శాతం లాభాలతో ముగిశాయి.

    Top Losers:కొటక్‌ బ్యాంక్‌ 7.50 శాతం, బజాజ్‌ఫైనాన్స్‌ 3.64 శాతం, ఎయిర్‌టెల్‌ 2.35 శాతం, టైటాన్‌ 2.17 శాతం, టీసీఎస్‌ 1.76 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ...

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...

    India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని...

    More like this

    Upasana Kamineni | మెగా కోడ‌లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఫుల్ హ్యాపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Upasana Kamineni | మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు తెలంగాణ...

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...