అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను సాధించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) తెలిపారు. విపక్షాల ఆందోళనల తర్వాత ఎట్టకేలకు పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ప్రారంభమైంది. 16 గంటల పాటు దీనిపై చర్చ జరగనుంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని ప్రకటించారు.
Operation Sindoor | భారత్ సత్తా చూపాం
పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడి తర్వాత ప్రధాని మోదీ (Prime Minister Modi) త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించి చర్యలను తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో మే 6-7 తేదీల్లో భారత్ చారిత్రాత్మక సైనిక చర్యను చేపట్టిందని ఆయన తెలిపారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి 22 నిమిషాల్లో పాక్, పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు.
ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని, పాక్ ప్రజలను కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు (Terrorists) మరణించారని ఆయన తెలిపారు. జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించినట్లు వెల్లడించారు. పాక్‌పై దాడి తర్వాత DGMOకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు.
Operation Sindoor | సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదు
విపక్షాలు సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదని రక్షణ మంత్రి పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని సూచించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి మాటలు వినలేదని పేర్కొన్నారు. సైన్యం విషయంలో ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు.
Operation Sindoor | భారత్ లక్ష్యం అది కాదు
పాకిస్తాన్ (Pakistan) భూ భాగాలను ఆక్రమించడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను అంతం చేయడమే దీని లక్ష్యమన్నారు. అందుకే ప్రజలకు హానీ కలగకుండా.. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామన్నారు. అయితే తర్వాత భారత్‌పై పాక్ దాడులకు పాల్పడిందని ఆయన చెప్పారు. ఆ దాడులను భారత రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వివరించారు. భారత ఆయుధాలకు ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టం చేశారు. భారత్ లక్ష్యాలను చేరుకోవడంతోనే యుద్ధం ఆపినట్లు తెలిపారు. పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి యుద్ధాన్ని ఆపాలని యత్నించిందన్నారు. భారత్ ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడంతో యుద్ధం ఆపేసినట్లు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ఆపేయాలని తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.