అక్షరటుడే, ఇందూరు: Shravana Masam | జిల్లాలో ప్రముఖ ఆలయాలు శ్రావణశోభను సంతరించుకున్నాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు చేశారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం (Neelkantheshwara Temple), శంభుని గుడిలో (Shambhuni Temple) భక్తులు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి.
Shravana Masam | ఉపవాసాలు పాటిస్తూ..
శ్రావణమాసంలో భక్తులు ఉపవాసాలను నియమంగా పాటిస్తారు. మహిళలు ఉపావాసాలు చేస్తూ సుహాసినులు వాయినాలిచ్చారు. ఆలయాల్లో అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి కుంకుమార్చనల్లో పాలుపంచుకుంటారు.
Shravana Masam | ఆలయాలు ముస్తాబు..
జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలను ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల ఆలయ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివుడికి ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో భక్తులు శివాలయాల్లో విశేషంగా పూజలు నిర్వహిస్తారు.
నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో అభిషేకం నిర్వహిస్తున్న భక్తులు