More
    HomeతెలంగాణHyderabad | రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

    Hyderabad | రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ఈగల్​ టీమ్​ పోలీసులు(Eagle Team Police) సోమవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో రూ.5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్​ చేశారు.

    Hyderabad | పండ్ల ట్రేలలో రవాణా..

    గంజాయిని ఒడిశా నుండి మహారాష్ట్ర(Maharashtra)కు తరలిస్తుండగా గంజాయి ఈగల్ టీమ్ పట్టుకుంది. వీరు ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ప్యాకెట్లలో నింపి పండ్ల ట్రేలలలో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నారు. అయితే ఈగల్​ టీం సభ్యులు వీరి ఆట కట్టించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేశారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న పవార్ కుమార్​తో పాటు సమాధాన్ బిస్, వినాయక్ పవార్​ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విక్కీ సేథ్, సచిన్ గంగారాం చౌహాన్ పరారిలో ఉన్నట్లు వెల్లడించారు.

    Hyderabad | ఈగల్​ టీమ్​ దూకుడు

    హైదరాబాద్(Hyderabad)​ నగరంలో కొన్నేళ్లుగా గంజాయి, డ్రగ్స్​ వినియోగం విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అలాగే నగరం మీదుగా మహారాష్ట్ర, బెంగళూరు వంటి ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్​ టీమ్​ ఏర్పాటు చేసంది. ఈ ఈగల్​ టీమ్​ సభ్యులు దూకుడు పెంచారు. డ్రగ్స్​, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

    ఈగల్​ టీమ్​ గంజాయి, డ్రగ్స్ దందాలపై మెరుపు దాడులు చేస్తోంది. తాజాగా రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకొంది. ఇటీవల మల్నాడు రెస్టారెంట్​ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్​ రాకెట్​ను ఛేదించింది. అలాగే పలువురు గంజాయి విక్రేతలను సైతం అరెస్ట్​చేసింది. డెకాయి ఆపరేషన్​ నిర్వహించి గంజాయికి బానిసైన వారిని అదుపులోకి తీసుకొని డి అడిక్షన్​ సెంటర్​కు తరలించింది.

    More like this

    Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ కొత్త ఫీచ‌ర్స్ గురించి మీకు తెలుసా.. ఈ ఆప్ష‌న్‌తో బ్యాక్‌గ్రౌండ్ మార్చేయ‌వ‌చ్చు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఓ...

    Stock Market | ఫ్లాట్‌గా సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | కీలకమైన యూఎస్‌ ఫెడ్‌ సమావేశాల ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు....

    Odisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము పిల్లలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కాకత్‌పూర్(Kakatpur) ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి...