Vana Mahotsavam
Vana Mahotsavam | నిజామాబాద్​ను గ్రీన్ సిటీగా మారుస్తాం

అక్షరటుడే, ఇందూరు: Vana Mahotsavam | నిజామాబాద్ జిల్లాను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్​ షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతి నగర్​లో (maruthi nagar) అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా అన్ని వర్గాల వారు బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Vana Mahotsavam | ఈ ఏడాది టార్గెట్​ 51 లక్షలు..

జిల్లాలో ఈ ఏడాది 51లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని విధించుకున్నామని షబ్బీర్​అలీ పేర్కొన్నారు. లక్ష్యసాధనకు సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఉచితంగా మొక్కలు అందిస్తోందని, నగరవాసులు తమ ఇంటి వద్ద నాటాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ (State Urdu Academy)​, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ (State Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశ వేణు, ఇన్​ఛార్జి డీఎఫ్​వో నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.