ePaper
More
    HomeతెలంగాణSub-Registrar office | ప్రైవేటు వ్యక్తులతో పనులు.. బోధన్​ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో తంతు

    Sub-Registrar office | ప్రైవేటు వ్యక్తులతో పనులు.. బోధన్​ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో తంతు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​: Sub-Registrar office | రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (sub-registrar offices) అక్రమాలు, అవినీతికి చెక్​ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఆన్​లైన్​ స్లాట్​ విధానంలో (online slot system) డాక్యుమెంట్లు జరిగేలా సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. అయినా పలు కార్యాలయాల్లో మాత్రం అధికారులు, సిబ్బంది తీరు మారట్లేదు. డాక్యుమెంట్​ రైటర్లపై ఆధారపడి పనిచేస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లో ఏకంగా ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్​ రైటర్లకు కంప్యూటర్​ గదుల్లోనే చైర్లు వేయించి మరి అధికారిక పనులు చేయించడం గమనార్హం.

    బోధన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో (Bodhan Sub-Registrar office) గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులతో అధికారిక పనులు చేయిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు ఈ కార్యాలయంలోనే ఉండి అన్ని రకాల డాక్యుమెంట్​ పనులు చక్కదిద్దుతున్నారు. సోమవారం ‘అక్షరటుడే’ (Akshara Today) ప్రతినిధి సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయానికి వెళ్లగా సదరు వ్యక్తులు పనులు చక్కబెడుతూ కనిపించారు. వివిధ రకాల సేవల నిమిత్తం వచ్చే ప్రజల నుంచి నేరుగా డాక్యుమెంట్లు తీసుకుని వారే సేవలందించడం ఆశ్చర్యకరం. మరోవైపు కంప్యూటర్లలోనూ ఆన్​లైన్​లో పనులు చేస్తూ కనిపించారు. ఇంత జరుగుతున్నా కార్యాలయ సబ్​ రిజిస్ట్రార్​ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం కొసమెరుపు.

    READ ALSO  Nalgonda | ప్రియుడి కోసం కన్న కొడుకును బస్టాండ్​లో వదిలేసిన తల్లి

    Sub-Registrar office | అక్రమాలకు ఆస్కారం

    ప్రభుత్వ ఆఫీసుల్లో (government offices) సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు ఎంతో కీలకమైనవి. వీటిల్లో రోజువారి జరిగే కార్యకలాపాలు, దస్తావేజులు అత్యంత గోప్యంగా ఉంచాల్సినవి ఉంటాయి. కానీ సబ్​రిజిస్ట్రార్లు మాత్రం ఇలా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని మరీ వారితో అధికారిక పనులు చేయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గతంలో నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం (Nizamabad Urban Sub-registrar office) పరిధిలో నకిలీ డాక్యుమెంట్లు వందలకొద్దీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో బోధన్​ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Sub-Registrar office | రూరల్​, ఎల్లారెడ్డి కార్యాలయాల్లోనూ..

    నిజామాబాద్​ రూరల్​, ఎల్లారెడ్డి సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లోనూ ప్రైవేటు వ్యక్తులు అధికారిక పనులు చక్కబెడుతున్నట్లు సమాచారం. డాక్యుమెంట్లకు సంబంధించిన సేవలు అందించడం, ఆన్​లైన్​ తదితర పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రైవేటు వ్యక్తులు అన్ని పనులు చక్కబెడుతుండడం చూసి కార్యాలయాలకు వచ్చిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో (government offices) పనులు చేయించడంపై నిజామాబాద్​ డీఆర్​, డీఐజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

    READ ALSO  Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...