అక్షరటుడే, వెబ్‌డెస్క్: WhatsApp Grievance | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ జిల్లాలో ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ గ్రీవెన్స్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండానే తమ సమస్యలపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ప్రస్తుతం ప్రజలు ఏదైనా సమస్య ఉంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి. అధికారులకు వినతి పత్రం అందించాలి. దీంతో చాలా మంది కార్యాలయాల చుట్టూ తిరిగలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ప్రజావాణి ద్వారా కూడా ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే కార్యాలయాలకు రాలేని వారి కోసం ప్రభుత్వం వాట్సాప్ గ్రీవెన్స్(WhatsApp Grievance) సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp Grievance | హైదరాబాద్ నగరంలో..
వాట్సాప్ గ్రీవెన్స్ సేవలు మొదట హైదరాబాద్(Hyderabad) నగరంలో అందుబాటులోకి వచ్చాయి. సోమవారం నుంచి ఈ సేవలు అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను వెళ్లకుండానే 7416687878 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని ఆమె తెలిపారు.
వాట్సాప్‌లో ఫిర్యాదు చేయగానే.. యూనిక్ ఐడీ(Unique ID) ఇస్తారు. వాట్సాప్‌లోనే అక్నాలెడ్జ్మెంట్ పంపుతారు. అనంతరం సదరు సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపిస్తారు. అనంతరం సదరు ఫిర్యాదుపై చేపట్టిన చర్యలను కూడా వాట్సాప్‌లో ఫిర్యాదుదారుడికి పంపుతారు. ప్రజావాణి(Prajavani)కి రాలేని ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులకు వాట్సాప్ గ్రీవెన్స్ ఫెసిలిటీ ఎంతో ఉపయోగ పడుతుందని కలెక్టర్(Collector) తెలిపారు.