Death to Trump
Death to Trump | విమానం గాలిలో ఉండగా.. బాంబు పెట్టానని అరిచిన ప్రయాణికుడు.. తర్వాత ఏమైందంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Death to Trump | విమానం గాలిలో ఉండగా.. ఓ ప్రయాణికుడు చేసిన పనికి అంతా షాక్​ అయ్యారు. ఓ వ్యక్తి ఒక్కసారిగా లేచి విమానంలో బాంబు పెట్టినట్లు అరిచాడు. దీంతో మిగతా వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లండన్ లూటన్ ఎయిర్​పోర్టు (London Luton Airport) నుంచి గ్లాస్గోకు వెళ్తున్న ఈజిజెట్​ ఎయిర్​లైన్స్​ విమానంలో (EasyJet Airlines plane) ఈ ఘటన చోటు చేసుకుంది.

విమానం టేకాఫ్​ అయ్యాక.. గాలిలో ఉండగా ఓ వ్యక్తి లేచాడు. తాను విమానాన్ని పేల్చేస్తానంటూ అరవడం ప్రారంభించాడు. ఫ్లైట్​లో బాంబు (Bomb on a Flight) పెట్టానని పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బందిని అతడితో మాట్లాడడానికి యత్నించగా.. బాంబు తీస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Death to Trump | బంధించిన ప్రయాణికులు

విమానంలో సదరు వ్యక్తి అమెరికాకు మరణం.. ట్రంప్​కు మరణం (Death to Trump) అంటూ అరవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. అయితే ఓ వ్యక్తి ధైర్యం చేసి అతడిని కిందపడేశారు. దీంతో మిగతా ప్రయాణికులు అతడిని బంధించారు. అనంతరం విమానం గ్లాస్గో ఎయిర్​పోర్టులో (Glasgow Airport) ల్యాండ్​ కాగానే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు అలా ఎందుకు అరిచాడని దర్యాప్తు చేస్తున్నారు.