ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు వర్ష సూచన

    Weather Updates | నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు వానలు దంచికొట్టాయి. వానాకాలం సీజన్​ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పుడే భారీ వర్షాలు (Heavy Rains) పడ్డాయి. దీంతో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్ట్​లు జలకళను సంతరించుకున్నాయి. సోమవారం రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.

    రాష్ట్రంలో ఆదివారం వర్షాలు పడలేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. ఎండ వస్తుంది. అక్కడక్కడ సాయంత్రం పూట తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో సైతం వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.

    READ ALSO  Education Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    Weather Updates | మళ్లీ వర్షాలు అప్పుడే..

    రాష్ట్రంలో మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ(Meteorological Department) పేర్కొంది. బుధ, గురు వారాల్లో మాత్రం మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయకుండా ముసురు వాన కురిసింది. అంతేగాకుండా సాయంత్రం పూట భారీ వర్షాలు పడ్డాయి. దీంతో చాలా గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. పంటలకు జీవం వచ్చింది. వాగులు ఉప్పొంగి పారుతున్నాయి.

    Weather Updates | ప్రాజెక్ట్​లకు జలకళ

    వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లకు జలకళ వచ్చింది. కృష్ణానదిపై గల జూరాల, శ్రీశైలం(Srisailam) ఇప్పటికే నిండగా.. తాజాగా నాగార్జున సాగర్(Nagarjuna Sagar)​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ కూడా నిండుకుండలా మారింది. దీంతో కొద్ది గంటల్లో జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు గోదావరిపై గల శ్రీరామ్​సాగర్​(Sriram Sagar)కు భారీగానే వరద వస్తోంది. మంజీరపై గల సింగూరు, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు మాత్రమే స్వల్ప ఇన్​ఫ్లో నమోదు అవుతోంది.

    READ ALSO  Retirement | ఉద్యోగ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్ కు సన్మానం

    Latest articles

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి...

    More like this