Heart Attack
Heart Attack | షటిల్​ ఆడుతూ కుప్పకూలిన యువకుడు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Heart Attack | దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత గుండెపోటుకు గురి అవుతుండడం గమనార్హం. అప్పటి వరకు బాగానే ఉండి.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇటీవల ఇలాంటి మరణాలు పెరగడం కలవర పెడుతోంది. తాజాగా ఓ యువకుడు షటిల్​ ఆడుతూ.. కుప్ప కూలిపోయాడు.

ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్(25) హైదరాబాద్​లో ఉంటున్నాడు. ఆయన ఓ ప్రైవేట్​ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి రాకేష్​ నాగోల్ స్టేడియంలో (Nagole Stadium) స్నేహితులతో కలిసి షటిల్ (Shuttle​)​ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆడుతూనే ఆయన కుప్ప కూలిపోయాడు. స్నేహితులు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

Heart Attack | పెరుగుతున్న గుండెపోట్లు

దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణాలు పెరుగుతున్నాయి. గతంలో వయసు పైబడిన వారికి ఎక్కువగా హార్ట్​ ఎటాక్(Heart Attack)​ వచ్చేది. అది కూడా రెండు మూడు సార్లు వచ్చాక కానీ మరణించే వారు కాదు. అయితే ఇటీవల యువత, టీనేజీ వారికి కూడా గుండెపోట్లు వస్తున్నాయి. గుండెపోటు రాగానే మృతి చెందుతుండడం గమనార్హం.

ఇటీవల నిజామాబాద్​ జిల్లా కమ్మర్​పల్లి మండలంలో ఇరిగేషన్​ ఏఈఈ నితిన్ (AEE Nithin)​ ప్రాజెక్ట్​ నీటి మట్టం పరిశీలించేందుకు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆయన వెంటనే మరణించాడు. గతంలో ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ.. సిక్స్​ కొట్టి హార్ట్​ ఎటాక్​ వచ్చి మరణించాడు. యువతకు గుండెపోట్లు పెరగడంపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు కారణాలను అన్వేషించి నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akshara Today (@aksharatoday)