IND vs ENG
IND vs ENG | చరిత్ర సృష్టించిన భార‌త్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: IND vs ENG | ఇంగ్లాండ్‌తో (England) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన నాలుగో టెస్టు చివరి రోజు అనూహ్య మలుపులు తిరుగుతూ చివ‌రికి డ్రాగా ముగిసింది. ఒకానొక ద‌శ‌లో ఈ మ్యాచ్ భార‌త్ ఓడిపోతుందా ఏంట‌నే సందేహాలు ఉండ‌గా, కేఎల్ రాహుల్‌(90), శుభ్‌మ‌న్ గిల్‌(103), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (101), జ‌డేజా (107) అద్భుత‌మైన బ్యాటింగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే మ్యాచ్ డ్రాగా ముగిసే దశలో, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు డ్రా ఆఫర్ (Draw Offer) చేస్తూ షేక్‌హ్యాండ్ ఇవ్వ‌బోతుంటే భార‌త జోడి సున్నితంగా తిర‌స్క‌రించింది. భారత ఆటగాళ్ల ప్రదర్శనను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (England captain Ben Stokes) జీర్ణించుకోలేకపోయాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. జడేజా, వాషింగ్టన్ సుందర్‌లపై స్టోక్స్ చేసిన కామెంట్లు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

IND vs ENG | ఇంత అవ‌స‌ర‌మా?

174/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ (India), తొలుత కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్లు కోల్పోవ‌డంతో ఇబ్బందుల్లో ప‌డింది. ఓటమి భయంతో ఉన్న పరిస్థితిలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరియు వాషింగ్టన్ సుందర్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 203 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే జడేజా, సుందర్ సెంచరీల దిశగా సాగుతున్న వేళ, మ్యాచ్ నిర్ణీత సమయం క‌న్నా ముందే స్టోక్స్ వారిని ముందుగానే డ్రా చేసుకుందామని అభ్యర్థించాడు. అయితే భారత ఆటగాళ్లు తమ వ్యక్తిగత మైలురాళ్లను పూర్తిచేయాలన్న ఉద్దేశంతో ఆటను కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్టోక్స్ జడేజాను ఉద్దేశించి, “హ్యారీ బ్రూక్ లేదా బెన్ డకెట్ బౌలింగ్‌లో టెస్ట్ సెంచరీ కావాలా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై జడేజా స్పందిస్తూ, “డ్రా నిర్ణయం నా చేతుల్లో లేదు.. కెప్టెన్ చెప్పినదాన్ని పాటించడమే నా పని,” అని చెప్పాడు.

జడేజా హ్యారీ బ్రూక్ (Harry Brook) బౌలింగ్‌లో సిక్స్ బాదుతూ తన శతకాన్ని పూర్తి చేయగా, ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ బౌండరీ, క్విక్ డబుల్‌తో తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. వెంటనే భారత్ డ్రా కు అంగీకరించింది. అయితే మ్యాచ్ అనంతరం, స్టోక్స్ జడేజా, సుందర్‌లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా బయటకు వెళ్లిపోయాడు, ఇది కూడా అభిమానుల కోపానికి కారణమైంది. స్టోక్స్ ప్రవర్తనపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. “ఇది క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకం,” “తమ ఆటగాళ్లను కించపరిచేలా మాటలు మాట్లాడడం ఏ మాత్రం స‌బ‌బు కాదంటూ కొంద‌రు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.