Anasuya Bharadwaj
Anasuya Bharadwaj | 30 ల‌క్ష‌ల మందిని బ్లాక్ చేశాన‌ని చెప్పిన అన‌సూయ‌.. మ‌ళ్లీ ట్రోలింగ్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anasuya Bharadwaj | టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అనసూయ భరద్వాజ్. దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్, న్యూస్ రీడర్, నటిగా ఆకట్టుకుంటూ.. ఇప్పుడు వెండితెరపై తనదైన గుర్తింపు సాధించింది. ‘జబర్దస్త్’ షో ద్వారా స్టార్ యాంకర్‌గా (Star Anchor) ఎదిగిన అనసూయ, ఆ తర్వాత సినిమాలవైపు అడుగులు వేసి వరుసగా గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’, ‘రంగమార్తాండా’, ‘రాజాకార్’, ‘విమానం’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించింది. అంతే కాకుండా ‘సుప్రీమ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘హరి హర వీరమల్లు’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి సందడి చేసింది. “సూయ సూయ అనసూయ” పాట అయితే అనసూయ పేరును మరింత పాపులర్ చేసింది.

Anasuya Bharadwaj | మ‌ళ్లీ బుక్ అయిందా..

తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న రాంచరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘పెద్ది’  సినిమాలో తనకు సాలిడ్ రోల్ ఇవ్వాలని ద‌ర్శ‌కుడికి చిన్న‌పాటి వార్నింగే ఇచ్చింద‌ట అన‌సూయ‌ (Anasuya Bharadwaj). బుచ్చిబాబు రాసే కథల్లో లేడీ క్యారెక్టర్స్‌కు మంచి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ‘పెద్ది’ సినిమాలో నాకు బలమైన పాత్ర ఇవ్వాలని చెప్పా అంటూ అన‌సూయ పేర్కొంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌చ్చే నెగెటివ్ కామెంట్స్‌పై కూడా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఎవరైనా నా గురించి అడ్డమైన మాట‌లు మాట్లాడితే బ్లాక్.. నాకు తెలిసి నేను దగ్గరి దగ్గర 3 మిలియన్ల (30 లక్షలు) మందిని బ్లాక్ (3 Million People Blocked) చేసి ఉంటానని అన‌సూయ పేర్కొంది.

ఆ స‌మ‌యంలో అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా, నేను నిజంగా బ్లాక్ చేశాను.. ఎందుకంటే నేను రియాక్ట్ అయ్యి అయ్యి ఇక భరించలేకపోయాను.. అందుకే ఇక నా ప్రపంచంలో నువ్వు లేవు.. నా లైఫ్‌లో ఇక నువ్వు లేవు అనుకొని వాళ్ల‌ని బ్లాక్ చేశా అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్‌పై కూడా ట్రోల్ న‌డుస్తుంది. చాలా మందిని బ్లాక్ చేశా అంటే బాగుండేది కాని, 30 లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని నెటిజన్లు అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అనసూయ కనీసం రోజుకు 10 మంది లేదా 100 మందిని బ్లాక్ చేసినా కూడా 3 మిలియన్ కాదంటూ సెటైర్స్ వేస్తున్నారు.