Srisailam Project
Srisailam Project | శ్రీ‌శైలం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత‌.. నాగార్జున సాగ‌ర్‌కు ల‌క్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అక్షరటుడే, వెబ్​డెస్క్:Srisailam Project | కృష్ణా ప‌రీవాహక ప్రాంతంలో కురిసిన వ‌ర్షాల‌తో కృష్ణా న‌ది (Krishna River) ఉర‌క‌లెత్తుతోంది. జూరాల ప్రియ‌దర్శిని, సుంకేశుల‌, శ్రీ‌శైలం ప్రాజెక్టులు నిండుకుండ‌ల్లా తొణికిస‌లాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీ‌శైలం ప్రాజెక్టుకు (Srisailam Project) భారీగా వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. దీంతో రెండు గేట్ల‌ను ఎత్తి దిగువ‌కు నీటిని వ‌దులుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌శైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమ‌ట్టంతో ఉండ‌గా, 1.23 ల‌క్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వ‌చ్చి చేరుతోంది. దీంతో రెండు స్పిల్‌వే గేట్ల‌ను ఎత్తి 53 వేల క్యూసెక్కుల‌ను దిగువ‌కు వ‌దులుతున్నారు. శ్రీ‌శైలం పూర్తి సామ‌ర్థ్యం 215 టీఎంసీల‌కు గాను, ప్ర‌స్తుతం 201 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

Srisailam Project | నిండుగా జూరాల‌..

ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టుకు (Priyadarshini Jurala Project) వ‌ర‌ద కొన‌సాగుతోంది. ల‌క్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వ‌స్తుండ‌గా, వ‌చ్చిన నీటిని వ‌చ్చిన‌ట్లు దిగువ‌కు వ‌దులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామ‌ర్థ్యం 1,045 అడుగులకు (9.67టీఎంసీల‌) గాను ప్ర‌స్తుతం 1042 అడుగుల మేర (8.23 టీఎంసీల‌) నీటి నిల్వ ఉంది.

Srisailam Project | నాగార్జున‌సాగ‌ర్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో..

శ్రీ‌శైలం నుంచి వ‌దులుతున్న మిగులు జ‌లాలు వ‌స్తుండ‌డంతో నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project) కొత్త నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ప్రాజెక్టు పూర్తి సామ‌ర్థ్యం 590 అడుగుల‌కు (312 టీఎంసీ) గాను 583 అడుగులకు (293 టీఎంసీల‌) చేరింది. 93 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వ‌స్తుండ‌గా, విద్యుదుత్ప‌త్తితో పాటు వివిధ కాల్వలకు 36 వేల క్యూసెక్కుల‌ను విడుద‌ల చేస్తున్నారు.