అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali | భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు.
అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న బీజేపీ అహంకారాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ద్వారా అడ్డుకున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లు (Bc Reserbations) అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అందరం ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి సత్తా చాటాలని కోరారు. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామన్నారు.