ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | డ్రంకన్​ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు.. ఎంత మంది చిక్కారంటే?

    Hyderabad | డ్రంకన్​ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు.. ఎంత మంది చిక్కారంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. వీటిలో చాలా వరకు మద్యం మత్తులో డ్రైవింగ్​ చేయడంతోనే చోటు చేసుకుంటున్నాయి. వీకెండ్​ వచ్చింది అంటే చాలు మందు బాబులు రెచ్చిపోతున్నారు. దీంతో సైబరాబాద్ (Cyberabad)​ ట్రాఫిక్​ పోలీసులు (Traffic Police) వారాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

    నగరంలో శనివారం స్పెషల్​ డ్రంకన్​ డ్రైవ్​ (Drunk n Drive) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 120 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికారు. వారిలో ద్విచక్ర వాహనదారులు 71 మంది, నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు 43 మంది, ఆటో రిక్షా డ్రైవర్లు నలుగురు, హెవీ వెహికల్​ డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

    READ ALSO  Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Hyderabad | 26 రోజుల్లో 1,318 కేసులు

    హైదరాబాద్​ నగరంలో జులై (July) ప్రారంభం నుంచి 26వ తేది వరకు మొత్తం 1,318 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేశారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష పడింది. మద్యం మోతాదు, గతంలో దొరికిన సందర్భాలను బట్టి న్యాయమూర్తి జైలు శిక్ష వేస్తారు. ఒక్క రోజు నుంచి ఏడు రోజుల వరకు శిక్ష పడినట్లు పోలీసులు వెల్లడించారు. 31 మందికి సమాజ సేవ చేయాలని పనిష్మెంట్​ విధించారు.

    రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నివారించడానికి హైదరాబాద్​ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం డ్రంకన్​ డ్రైవ్​ టెస్టులు చేపట్టడటంతో పాటు శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్​ చేపడుతున్నారు. అంతేగాకుండా పగటి పూట కూడా తనిఖీలు (Drunk driving checks) చేపడుతున్నారు. గతంలో సాయంత్రం తర్వాత మాత్రమే డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేసేవారు. అయితే కొందరు పగలు కూడా మందు తాగి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పగటి పూట ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.

    READ ALSO  Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this