Maharashtra
Maharashtra | మ‌హారాష్ట్ర‌లో దారుణం.. యువతి కిడ్నాప్‌.. కారులోనే గ్యాంగ్ రేప్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) లోనావాలాలో దారుణం చోటు చేసుకుంది. యువ‌తిని కిడ్నాప్ చేసి, కారులో తిప్పుతూ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. ముగ్గురు యువ‌కులు కారులోనే వంతుల వారీగా ప‌లుమార్లు అత్యాచారం చేసిన అనంత‌రం నిర్మానుష్య ప్రాంతంలో వ‌దిలేసి వెళ్లారు. సంచల‌నం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Maharashtra | కారులోనే గ్యాంగ్‌రేప్‌..

లోనావాలా(Lonavala)లోని తుంగౌలి ప్రాంతంలో 23 ఏళ్ల స్థానిక మహిళ న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా, కారులో వ‌చ్చిన 25-35 మ‌ధ్య వ‌య‌స్సున్న ముగ్గురు యువ‌కులు వ‌చ్చి ఆమెను బ‌ల‌వంతంగా కారులోకి లాక్కెళ్లారు. కదులుతున్న కారులోనే లైంగిక దాడి చేశారు. ఏకాంత ప్రదేశాలకు తీసువెళ్లి వంతుల వారీగా ఆమెపై అత్యాచారం చేశారు. దారిలో అనేక చోట్ల కారును ఆపారు. ప‌లుమార్లు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన దుండ‌గులు.. బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతంలో ప‌డేసి వెళ్లారు. గాయపడిన బాధితురాలు ఎలాగోలా ఇంటికి చేరుకుంది. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Maharashtra | ఒక‌రి అరెస్టు..

ఫిర్యాదు రాగానే హుటాహుటిన రంగంలోకి దిగిన లోనావాలా నగర పోలీసులు (Lonavala City Police) కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు ప్రారంభించారు. 12 గంటల్లోనే నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్ర‌త్యేక బృందాలు (Special Teams) గాలిస్తున్నాయి. గ్యాంగ్ రేప్‌ను సీరియ‌స్‌గా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు లోనావాలా నగర పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజేష్ రామఘరే (Lonavala Inspector Rajesh Ramghare) తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. మ‌రోవైపు, గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాంతంలో మహిళల భద్రతపై ఆందోళన వ్య‌క్తం చేశారు.