Gujarat
Gujarat | నడుచుకుంటూ వెళ్తూ.. స్కూల్​ బిల్డింగ్ పైనుంచి దూకేసిన విద్యార్థిని

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat | విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల విద్యార్థుల బలవన్మరణాలు పెరిగాయి. చిన్న చిన్న కారణాలకే పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా గుజరాత్​లో (Gujarat)​ ఓ పదో తరగతి విద్యార్థిని మాములుగానే నడుచుకుంటూ వెళ్తూ పాఠశాల భవనంపై నుంచి దూకేసింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లో (Ahmedabad) చోటు చేసుకుంది.

అహ్మదాబాద్​లోని నవరంగ్‌పురాలోని సోమ్ లలిత్ పాఠశాల (Som Lalit School)లో ఓ బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఆమె గురువారం ఇంటర్వెల్​ సమయంలో తరగతి గది నుంచి బయటకు వచ్చింది. అనంతరం చేతిలో చైన్​ తిప్పుతూ మాములుగానే నడుచుకుంటూ వెళ్లింది. అయితే ఒక్కసారిగా భవనంపై నుంచి కిందకు దూకేసింది. విద్యార్థులు ఆమెను గమనించేలోపే నాలుగో అంతస్తు నుంచి కిందకూ దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అయితే బాలిక పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె పాఠశాల భవనంపై నుంచి దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అప్పటి వరకు మాములుగా వెళ్తున్న విద్యార్థి ఒక్కసారిగా దూకడంపై నెటిజెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు (Students) ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొంటున్నారు.

Gujarat | ఆరోగ్య సమస్యలు

సదరు బాలిక ఐదేళ్లుగా సోమ్ లలిత్‌లో చదువుతోంది. అయితే సదరు విద్యార్థినికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పాఠశాల సిబ్బంది (School Staff) తెలిపారు. నెల రోజుల సెలవుల తర్వాత ఆమె ఇటీవల నుంచే పాఠశాలకు వస్తోందన్నారు. ఆ రోజు ఆమె బాధగా కనిపించిందని, తరగతి గదిలో అరిచిందని ప్రిన్సిపాల్ లీనా అరోరా తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థుల ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.