అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heroine Ashika | ఇందూరులో హీరోయిన్ ఆషిక(Heroine Ashika) రంగనాథ్ సందడి చేసింది. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఓ జ్యుయలరీ షోరూం(Jewellery showroom) ప్రారంభోత్సవంలో పాల్గొంది ఈ తార. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు.
ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను అలరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువత, మహిళల టేస్ట్‌కు తగిన జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో రాణిస్తున్న బామ ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆషికా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిత్రం 2016లో విడుదలైన కన్నడ చిత్రం ’క్రేజీ బాయ్’. ఈ చిత్రం ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ’రాంబో 2’, ’రేమో’, ’మధగజ’ వంటి చిత్రాలతో కన్నడ సినిమా పరిశ్రమ(Kannada Film Industry)లో స్థిరపడింది. ’మధగజ’ చిత్రంలో ఆమె నటనకు SIIMA అవార్డు ఉత్తమ నటి (కన్నడ) విభాగంలో అవార్డు లభించింది.
Heroine Ashika | అమిగోస్‌తో..
తెలుగు సినీ పరిశ్రమలో ఆషికా తొలి చిత్రం ’అమిగోస్’ (2023), నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ’నా సామిరంగ’ చిత్రంలో నాగార్జున సరసన నటించింది. తన నటన, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ’విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.

