అక్షరటుడే, వెబ్డెస్క్: Railway Passengers | కాచిగూడ నుంచి ప్రస్తుతం కరీంనగర్ వరకు డెమూ రైలు(Demo Train) నడుస్తోంది. అయితే దీనిని పెద్దపల్లి వరకు నడపాలనే డిమాండ్ ఉంది. సమయంతో పాటు దూరం తగ్గుతుంది. దీంతో నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఢిల్లీ, వైజాగ్, కాశీ, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.
Railway Passengers | పెద్దపల్లి మీదుగా అనేక రైళ్లు
పెద్దపల్లి(Peddapalli) మీదుగా వివిధ నగరాలు, ప్రముఖ క్షేత్రాలకు అనేక రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ–కరీంనగర్ డెమూ రైలు(Kacheguda-Karimnagar Demo Train)ను పెద్దపల్లి వరకు పొడిగిస్తే అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. న్యూఢిల్లీ – వైజాగ్ ఏపీ ఎక్స్ప్రెస్, అహ్మదాబాద్ టు చెన్నై నవజీవన్ ఎక్సెప్రెస్ పెద్దపెల్లి మీదుగా వెళ్తుంటాయి. అలాగే మాతా వైష్ణోదేవి కాట్రా టు చెన్నై సెంట్రల్ వారంలో మూడు రోజులు, మరో రెండు రోజులు లక్నో టు చెన్నై రాకపోకలు సాగుతుంటాయి. డెమూ పొడిగిస్తే నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉటుంది. అలాగే రైలులో ఆక్యుపెన్సీ సైతం పెరుగుతుంది. అంతేకాకుండా పెద్దపల్లి నుంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో చెన్నై టు ఢిల్లీ మీదుగా వైష్ణోదేవి వెళ్లే రైలు ఉంటుంది. దీనిని త్వరలో శ్రీనగర్ వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు(Railway Passengers) ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భద్రాచలం వెళ్లే వారికి పెద్దపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ (పుష్పుల్) ఉంటుంది.
Railway Passengers | బోధన్– సిర్పూర్ పుష్పుల్ టైమింగ్ మార్చాలి
బోధన్ – కరీంనగర్ – సిర్పూర్ మధ్య నిత్యం పుష్పుల్ రైలు(Push Pull Train) రాకపోకలు సాగితోంది. అయితే ఈ రైలు ఉదయం 4 గంటలకు బోధన్(Bodhan) నుంచి బయలు దేరుతోంది. అంత పొద్దున ఉండటంతో ప్రయాణికులు ఎక్కడానికి ఆసక్తి చూపడం లేదు. దీని సమయాన్ని మార్చాలని కోరుతున్నారు. దీనిని అజంతా ఎక్స్ప్రెస్ సమయానికి ఆరు గంటలకు లింక్ చేసి నడిపిస్తే జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. షిరిడీ, ఔరంగాబాద్ వెళ్లే ప్రయాణికులు ఉదయం దిగి వెళ్లవచ్చు. అలాగే 12 గంటల సమయంలో కాశీకి సికింద్రాబాద్ – దానాపూర్ ఎక్సెప్రెస్ వయా వారణాసి వెళ్తుంది. దీంతో నిజామాబాద్ ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి.