ePaper
More
    HomeజాతీయంMansa Devi temple | హరిద్వార్‌ మానసదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

    Mansa Devi temple | హరిద్వార్‌ మానసదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mansa Devi temple | ఉత్తరాఖండ్​లోని (Uttarakhand) హరిద్వార్​లో విషాదం చోటు చేసుకుంది. మానస దేవి ఆలయంలో తొక్కిసిలాట చోటు చేసుకోగా.. ఏడుగురు భక్తులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 9:30 గంటలకు చోటు చేసుకుంది.
    హిందువులు పవిత్రంగా భావించే మానస దేవి ఆలయానికి ఆదివారం ఉదయం భారీగా భక్తులు(Huge Devotees) తరలి వచ్చారు. అయితే ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విద్యుత్ వైర్​ తెగిపడడంతో షాక్​ కొడుతుందని పుకారు వ్యాప్తి చెందడంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకోగా ఏడుగురు మృతి చెందారు. దాదాపు 55 మంది గాయపడ్డారు.

    Mansa Devi temple | సహాయక చర్యలు

    తొక్కిసలాట(Stampede)పై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటకు ముందు ఆలయం వద్ద భారీగా భక్తులు గుమిగూడినట్లు గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే(Commissioner Vinay Shankar Pandey) తెలిపారు.

    READ ALSO  Mann Ki Baat | అంత‌రిక్ష రంగంలో భార‌త్ ముందంజ‌ మ‌న్‌కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ.. శుభాన్షు శుక్లాపై ప్ర‌శంస‌లు

    Mansa Devi temple | పవిత్ర మాసంలో..

    హిందువులకు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో (Shravana Masam) ఉత్తరాదిలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శ్రావణ మసం సందర్భంగా ఆదివారం మానస దేవి ఆలయాకినికి భారీగా భక్తులు రాగా.. ఈ విషాదం చోటు చేసుకుంది.

    Mansa Devi temple | క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

    మానసా దేవి ఆలయానికి (Manasa Devi Temple) వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్ ధామి (Uttarakhand CM Pushkar Singh Dhami) అన్నారు. స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సహాయక చర్యలపై తాను అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

    READ ALSO  Operation Sindoor | అధికారపక్షాన్ని ఇరికించబోయి తానే ఇరుక్కున్న కాంగ్రెస్.. లోక్‌స‌భ‌లో మాట్లాడ‌ని రాహుల్‌, ప్రియాంక‌

    Mansa Devi temple | ప్రధాని సంతాపం

    మానస దేవి ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్​ సీఎంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this