అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్‌పార్టీ(Rave Party) కలకలం రేపింది. నగరంలో ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ విక్రయాలకు జోరుగా సాగుతున్నాయి. రేవ్ పార్టీలకు సైతం నగరాన్ని కొందరు అండగా మార్చుకుంటున్నారు. నగరంలోని కొండాపూర్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన కొందరు కొండాపూర్(Kondapur)లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఓ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రేవ్ పార్టీని భగ్నం చేసి, ఏపీ(AP)కి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందినవారుగా గుర్తించారు.
Hyderabad | గంజాయి, డ్రగ్స్ స్వాధీనం
విజయవాడకు చెందిన వ్యక్తి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ పార్టీ(Drugs Party)ని అశోక్‌నాయుడు అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో గంజాయితో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడా బాబులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్పార్టీలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు (Hyderabad Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్
నగరంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఈగల్ టీమ్ (Eagle Team) ఏర్పాటు చేసింది. ఈ టీమ్ దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurent) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దాందాపై ఈగల్ టీమ్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసింది. రెస్టారెంట్ యజమాని సూర్య ఏకంగా నైజిరియన్ డ్రగ్స్ డాన్‌తో కలిసి నగరంలోని పలు పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్‌తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. నగరంలో డ్రగ్స్, రేవ్ పార్టీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.