అక్షరటుడే, కోటగిరి: Pothangal | కంకర లారీ బోల్తా పడిన ఘటన పోతంగల్ చెక్‌పోస్టు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి కోటగిరి మండలం ఎత్తొండ వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం బోల్తా పడింది. కెనాల్ వర్క్ కోసం కంకరతో వెళ్తున్న లోడ్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. బీర్కూర్ మంజీర బ్రిడ్జి నుంచి వెళ్తుండగా పోతంగల్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. బ్రేక్ వీల్ పని చేయకపోవడంతో 33 కేవీ 11 కేవీ స్తంభాలను ఢీ కొట్టడంతో విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాంద్ పాషాకు ఎలాంటి గాయాలు కాలేదు.
Pothangal | గతంలోనూ ప్రమాదాలు
చెక్‌పోస్టు సమీపంలో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సమీపంలో ఉన్న కాలువపై కల్వర్టుకు సైడ్‌వాల్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఓ కారు బోల్తా పడింది. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్‌వాల్స్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.