అక్షరటుడే, నిజాంసాగర్/ఎల్లారెడ్డి : Projects Inflow | నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఎల్లారెడ్డి మండల శివారులోని కల్యాణి ప్రాజెక్ట్(Kalyani Project)కు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో రెండు గేట్లను ఎత్తి వేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఆదివారం ఉదయం 330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో రెండు వరద గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కల్యాణి ప్రాజెక్టు నీటిమట్టం 409.5 మీటర్లు కాగా ప్రస్తుతం 408 మీటర్లకు చేరింది. సింగీతం రిజర్వాయర్‌లోకి (Singeetham Reservoir) ఎగువ నుంచి 750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం నీటిమట్టం 416.5 0 మీటర్లకు గాను 411.85 మీటర్లకు చేరింది.
Projects Inflow | నిజాంసాగర్‌కు స్వల్పంగా ఇన్‌ఫ్లో
ఉమ్మడి జిల్లా వర ప్రధాయిని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి (Nizamsagar Project) స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,624 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.39 టీఎంసీల నీరు ఉన్నట్లు ఈఈ సోలోమాన్(E.E. Solomon) తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వాగులు, జలాశయాల దగ్గరకు వెళ్లొద్దన్నారు.