అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPO | ఓవైపు స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతుండగా.. మరోవైపు ప్రైమరీ మార్కెట్(Primary Market)లో మాత్రం జోరు తగ్గడం లేదు. ఈ వారంలో ఏకంగా 14 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ(Public issue)కు వస్తున్నాయి. ఇందులో ఐదు మెయిన్‌బోర్డు(Main board) కంపెనీలు కాగా.. తొమ్మిది ఎన్‌ఎంఈలు. మెయిన్‌బోర్డ్‌కు చెందిన లక్ష్మి ఇండియా ఫైనాన్స్, ఆదిత్య ఇన్ఫోటెక్, శ్రీలోటస్ డెవెలపర్స్, ఎన్‌ఎస్‌డీఎల్, ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్ కంపెనీలతోపాటు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలు రిపోనో, ఉమియా మొబైల్, బీడీ ఇండస్ట్రియల్, మెహుల్ కలర్స్, టక్‌యాన్ నెట్‌వర్క్స్, ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈలు కాయ్‌టెక్స్, క్యాష్ యుఆర్ డ్రైవ్ మార్కెటింగ్, రెనాల్ పాలికెమ్, ఫ్లైఎస్‌బీఎస్ ఏవియేషన్ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్(Subscription) ఈవారమే ప్రారంభం కానుంది.
IPO | లక్ష్మి ఇండియా ఫైనాన్స్..
లక్ష్మి ఇండియా ఫైనాన్స్(Laxmi India Finance) ఐపీవో ద్వారా రూ. 254.26 కోట్లు సమీకరించనుంది. ప్రైస్‌బాండ్ రూ. 150 నుంచి రూ. 158గా ఉంది. ఈ ఐపీవో(IPO) సబ్‌స్క్రిప్షన్ 29న ప్రారంభమై 31న ముగియనుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 5న లిస్ట్ కానున్నాయి.
IPO | ఆదిత్య ఇన్ఫోటెక్..
రూ. 1,300 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఆదిత్య ఇన్ఫోటెక్(Aditya Infotech) ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభమై గురువారం ముగుస్తుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 5న లిస్ట్ కానున్నాయి. గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ ధర రూ. 675గా ఉంది.
IPO | శ్రీలోటస్ డెవలపర్స్ అండ్ రియాలిటీ..
శ్రీలోటస్ డెవలపర్స్ అండ్ రియాలిటీ(Sri Lotus Developers and Realty) కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 792 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. బుధవారం ప్రారంభమయ్యే ఐపీవో సబ్‌స్క్రిప్షన్ శుక్రవారం వరకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ షేర్లు 6వ తేదీన లిస్టవుతాయి. ఒక్క రూపాయి ముఖ విలువ(Face value) కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 150 గా ఉంది.
IPO | ఎన్‌ఎస్‌డీఎల్..
రూ. 4,011.60 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తున్న ఎన్‌ఎస్‌డీఎల్(NSDL) కంపెనీ సబ్‌స్క్రిప్షన్ 30న ప్రారంభమై ఒకటో తేదీన ఒకటో తేదీ వరకు కొనసాగనుంది. కంపెనీ షేర్లు 6న లిస్టవుతాయి.
IPO | ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్..
ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్(M&B Engineering) ఐపీవో సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభం కానుంది. శుక్రవారం వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంది. కంపెనీ షేర్లు 6వ తేదీన లిస్ట్ కానున్నాయి. పది రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు(Equity share) ధర గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 385గా ఉంది. ఐపీవో ద్వారా రూ. 650 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం.
IPO | ఎస్‌ఎంఈ ఐపీవోలు..
రూ. 25.34 కోట్లు సమీకరించడం కోసం రెపోనో, రూ. 23.63 కోట్లు సమీకరించడం కోసం ఉమియా మొబైల్ ఐపీవోకు వస్తున్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ 28న ప్రారంభమై 30 న ముగుస్తుంది. 4న బీఎస్‌ఈ(BSE)లో లిస్ట్ అవుతాయి.కాయ్‌టెక్స్ రూ. 66.31 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ 29న ప్రారంభమై 31న ముగుస్తుంది. 5న ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతుంది.
రూ. 43.03 కోట్లు సమీకరించడం కోసం బీడీ ఇండస్ట్రీస్, రూ. 20.56 కోట్ల కోసం మెహుల్ కలర్స్, రూ. 1944 కోట్ల కోసం టక్‌యాన్ నెట్‌వర్క్స్ ఐపీవోకు వస్తున్నాయి. ఈ ఐపీవోలు 30న ప్రారంభమై ఒకటో తేదీన ముగుస్తాయి. 6న బీడీ ఇండస్ట్రీస్, మెహుల్ కలర్స్ బీఎస్‌ఈలో, టక్‌యాన్ నెట్‌వర్క్స్ ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి.క్యాష్ యుఆర్ డ్రైవ్ మార్కెటింగ్ రూ. 57.42 కోట్లు, రెనాల్ పాలికెమ్ రూ. 24.20 కోట్లు సమీకరించడం కోసం పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. ఈ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్ 31న మొదలై నాలుగో తేదీన ముగుస్తుంది. 7న ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.ఫ్లైఎస్‌బీఎస్ ఏవియేషన్ ఐపీవో తేదీలు ఖరారైనా ఐపీవో సైజ్, ప్రైస్‌బాండ్ ఖరారు కావాల్సి ఉంది. ఆగస్టు ఒకటో తేదీనుంచి ఐదో తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్‌కు గడువుంది. ఎనిమిదో తేదీన కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టవుతాయి.