అక్షరటుడే, వెబ్‌డెస్క్:Indian Airspace | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌పై కేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వాణిజ్యం సహా అన్ని సంబంధాల రద్దు వంటి నిర్ణయాలతో పొరుగు దేశానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది. తాజాగా మరో అడుగు ముందుకేసిన కేంద్ర ప్రభుత్వం(Central government) మన గగనతలాన్ని మూసి వేయనుంది. పాకిస్తాన్ విమానాలు మన దేశం మీదుగా ప్రయాణించడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించనుంది.
Indian Airspace | పాక్ విమానాలపై ఆంక్షలు
కాశ్మీర్‌లోని పహల్గామ్‌పై ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాక్(India-Pak)ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ పొరుగు దేశంపై అనేక ఆంక్షలు విధించింది. దీంతో పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాక్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ విమానాలను(Pakistani planes) మన గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
Indian Airspace | పాక్ విమానాలపై భారం..
ఒకవేళ భారత్ గనుక తన గగనతలాన్ని మూసివేస్తే పాక్ విమానాయాన సంస్థలకు(Pakistani airlines) తీవ్ర నష్టాలు తప్పవు. కౌలాలంపూర్, మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు పాక్ విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అటు చైనా(China) మీదుగా లేదా ఇటు శ్రీలంక మీదుగా దారి మళ్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్‌లైన్స్‌పై ఇది మరింత భారం మోపనుంది.