అక్షరటుడే, వెబ్‌డెస్క్ : American Airlines | విమానాల్లో సాంకేతిక లోపాలు, మంటలు చేలరేగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన డెన్వర్ విమానాశ్రయం (Denver airport)లో చోటు చేసుకుంది.
అమెరికా (America)లోని నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం వెళ్లాల్సి ఉంది. అయితే రన్‌వేపై వేగంగా వెళ్తుండగా సమస్యను గుర్తించారు. ల్యాండింగ్ గేర్ పని చేయడం లేదని విమానాన్ని నిలిపేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్యాబిన్లో మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు. వారిని వెంటనే స్లయిడ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు తెలిసింది. ఆ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. కస్టమర్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది. విమానాన్ని తనిఖీ చేయడం కోసం సేవల నుంచి తొలగించినట్లు పేర్కొంది.
American Airlines | బాబోయి ‘బోయింగ్’
బోయింగ్ (Boeing) 737 MAX 8 విమానం టేకాఫ్‌కు ముందు రన్‌వేపై ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని అత్యవసర సిబ్బంది, డెన్వర్ అగ్నిమాపక విభాగం వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. అయితే బోయింగ్ విమానాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయి 270 మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఇటీవల అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ (Delta Airlines)కు చెందిన బోయింగ్ విమానం గాలిలో ఉండగా ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే వరుసగా బోయింగ్ విమానాల్లో సమస్యలు వస్తుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
🚨Terrifying visuals of evacuation from an aircraft in Denver, USA. pic.twitter.com/aZo9DEdhwc
— Indian Infra Report (@Indianinfoguide) July 27, 2025