More
    Homeజిల్లాలుకామారెడ్డిDoctorate in Chemistry | కెమిస్ట్రీలో కామారెడ్డి జిల్లావాసికి డాక్టరేట్

    Doctorate in Chemistry | కెమిస్ట్రీలో కామారెడ్డి జిల్లావాసికి డాక్టరేట్

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Doctorate in Chemistry | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన నీరడి సూర్యంకు ఉస్మానియా యూనివర్సిటీ (osmania university) డాక్టరేట్ పట్టాను ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కొత్త లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో “సింథసిస్, క్యారెక్టరైజేషన్, ఆప్టికల్, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఫోటోక్యాటెలిటిక్ అండ్ బయలాజికల్ యాక్టివిటీ ఆఫ్ మాంగనీస్, ఎటర్బియం, యట్రియం, నియోడైమియం అండ్ డిస్ప్రోసియమ్ డోప్డ్ కోబాల్ట్ నానోఫెర్రైట్స్” అనే అంశంపై పరిశోధన చేశారు.

    ఆయన పరిశోధన పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్​లో (International journals) ప్రచురించబడ్డాయి. ఆయన చేసిన పరిశోధలను పరిశీలించిన యూనివర్సిటీ అధికారులు సూర్యంకు పీహెచ్​డీ (PHD) పట్టా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆయన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) జాతీయ అర్హత పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, మిత్రులు, సహచర పరిశోధకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా నీరడి సూర్యం మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి నేడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్ పట్టా పొందడం కోసం తనను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు, వెన్నుదన్నుగా నిలబడ్డ పరిశోధన పర్యవేక్షకుడు డాక్టర్​ లక్ష్మారెడ్డి, కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్​ మనోహర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ప్రొఫెసర్​ రామచందర్, అధ్యాపకులు మురళీధర్ రెడ్డి, విజయ్ కుమార్, దేవదాస్ తదితరులు కృతజ్ఞతలు తెలిపాడు.

    More like this

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...