అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price | మొన్నటి వరకు రూ.లక్షకు పైగా పలికిన బంగారం ధరలు (Gold rates) ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్యలు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
అయితే ప్రస్తుతం ధరలు లక్ష రూపాయల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. జులై 27వ తేదీ నమోదైన ధరల ప్రకారం చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 99,930 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 91,600, అలానే 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 74,950గా ట్రేడ్ అయింది. ఇక వెండి (కిలో) ధర రూ. 1,16,000గా నమోదైంది.
Today Gold Price : లక్షకి దిగువన..
దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్లు – రూ. 99,930 కాగా, 22 క్యారెట్లు – రూ. 91,600గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్లు – రూ. 1,00,080గా, 22 క్యారెట్లు – రూ. 91,750 , ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరులలో (Bangalore) 24 క్యారెట్లు – రూ. 99,930 కాగా, 22 క్యారెట్లు – రూ. 91,600గా నమోదైంది.
మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ధరలు పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా స్థిరంగా ఉండొచ్చు. కనుక బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నవారు.. తాజా ధరలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇటీవల అంతర్జాతీయంగా బంగారం ధరలు ఊగిసలాటకు లోనయ్యాయి. ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలపడడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
డాలర్ (dollar) బలపడితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాలర్ విలువ పెరగడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి ఆసక్తి తగ్గి, డిమాండ్ తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం కూడా బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపింది. అధిక వడ్డీ రేట్ల సమయంలో, బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులపై ఆకర్షణ తగ్గుతుంది.
దీంతో పాటు, ఇటీవల చోటుచేసుకున్న వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ ధరల తగ్గుదలకు తోడ్పడ్డాయి. వెండి ధరలు కూడా తగ్గడానికి ముఖ్య కారణం పారిశ్రామిక డిమాండ్‌లో తగ్గుదల. వెండి ప్రధానంగా పరిశ్రమలలో వినియోగించబడుతుంది. గ్లోబల్ ఉత్పత్తి మందగించడం వల్ల పారిశ్రామిక అవసరాలు తగ్గి, దీని ధరలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.