More
    Homeజిల్లాలుకామారెడ్డిPocharam project | పోచారం ప్రాజెక్టులోకి భారీగా ఇన్​ఫ్లో.. 15.3 అడుగులకు చేరిన నీటిమట్టం

    Pocharam project | పోచారం ప్రాజెక్టులోకి భారీగా ఇన్​ఫ్లో.. 15.3 అడుగులకు చేరిన నీటిమట్టం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు, చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి ఇన్​ఫ్లో వస్తోంది. కాగా.. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయని అయిన పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి గాంధారి పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల ద్వారా 10 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది.

    Pocharam project | పెరిగిన నీటిమట్టం

    ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.5 అడుగులు కాగా.. ప్రస్తుతం 15.3 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు మండలాల్లో పంటలకు నీరందనున్నాయి. కాలువ ద్వారా నేటి విడుదలకు సైతం అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్ట్​ పూర్తిస్థాయిలో నిండింది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికీ ప్రాజెక్టు నిండలేదు. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి రెండు మండలాలల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

    More like this

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...