ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​BRAOU | నూతన శకానికి నాంది పలికిన బీఆర్​ఏఓయూ.. నైపుణ్యాభివృద్ధికి సరికొత్త దిశగా అడుగులు

    BRAOU | నూతన శకానికి నాంది పలికిన బీఆర్​ఏఓయూ.. నైపుణ్యాభివృద్ధికి సరికొత్త దిశగా అడుగులు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Universal University – BRAOU) తన 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానంలో తాజాగా నూతన అధ్యాయానికి నాంది పలికింది. యువత, నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాలు అందించడం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చే దిశగా అడుగులు వేస్తోంది.

    1982లో భారతదేశపు మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా స్థాపించబడిన BRAOU.. ఇప్పటి వరకు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులకు, ముఖ్యంగా మహిళలు, గ్రామీణ, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించింది. తాజాగా మరో కీలక అడుగు ముందుకు వేసింది.

    BRAOU | నూతన లోగో ఆవిష్కరణ..

    BRAOU తాజాగా కొత్త లోగోను ఆవిష్కరించింది. ఇది ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ దృష్టికి ప్రతీకగా యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. “అప్పొదీపోభవ” సూక్తిని చలన సూత్రంగా చేసుకున్న బీఆర్​ఏఓయూ.. ఆధునిక భారత జాతి నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని దిక్సూచిగా మార్చుకుని ముందుకు అడుగులు వేస్తోంది.

    READ ALSO  Heroine Ashika | ఇందూరులో హీరోయిన్​ ఆషికా​ సందడి

    BRAOU | నైపుణ్యాభివృద్ధిపై దృష్టి..

    అంబేడ్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ (Ambedkar Open University) కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా.. నైపుణ్యాభివృద్ధి, వృత్తి శిక్షణ, ప్రత్యక్ష ఉపాధి కల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సహకారంతో రూపొందించిన గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్‌వర్క్ కింద పలు నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.

    • స్టైఫండ్​-ఆధారిత విద్యా కార్యక్రమం (Stipend-based Education Program – STEP): అండర్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవంతో పాటు నెలకు రూ. 7 వేల నుంచి రూ. 24 వేల వరకు స్టైఫండ్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం Retailers Association Skill Council of India (RASCI) తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రారంభంలో 10,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో సగం మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
    •  WE-Enable ప్రోగ్రామ్: ప్రభుత్వ సంస్థ WeHub భాగస్వామ్యంతో ఏటా 2,000 మంది మహిళా విద్యార్థులకు ఆవిష్కరణ, వ్యవస్థాపకత, నాయకత్వ నైపుణ్యాలలో శిక్షణ అందించాలని నిర్ణయించింది.
    READ ALSO  Nizmabad city | ఎట్టకేలకు కదిలిన అధికారులు.. అక్రమ బిల్డింగ్ పనుల నిలిపివేత

    BRAOU | వ్యూహాత్మక నైపుణ్య సహకారాలు..

    • స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌తో (Swami Ramananda Tirtha Rural Institute) కలిసి ఏటా 5 వేల మంది గ్రామీణ, గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి కోర్సులు అందించబోతోంది.
    • సింగరేణి కాలరీస్ కంపెనీ (Singareni Collieries Company – SCCL) సహకారంతో ఏటా 10 వేల మందికి, దశాబ్దంలో ఒక లక్ష కుటుంబాలకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
    • ఏటా 10 వేల మంది గ్రాడ్యుయేట్లకు కీలకమైన ఆంగ్ల భాష, జీవన నైపుణ్య శిక్షణ అందించనుంది.

    BRAOU | సమత ఫ్రీషిప్‌లు & నిపుణ ఫెలోషిప్‌లు..

    • సమత ఫ్రీషిప్ (Samatha Freeships) కింద ప్రాచీన గిరిజనులు, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచిత ఉన్నత విద్య అందించనుంది.
    • నిపుణ ఫెలోషిప్‌ (Expert Fellowships) లు కింద వెనుకబడిన వర్గాలకు వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, భాషా అభ్యాసానికి విశ్వవిద్యాలయం పూర్తి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఏటా కనీసం 5,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
    READ ALSO  Krishna River | కృష్ణానదికి భారీగా వరద.. అన్ని ప్రాజెక్ట్​ల గేట్లు ఓపెన్​

    BRAOU | యూజీసీ(UGC) నూతన లాటరల్ ఎంట్రీ పాలసీ

    సరళమైన డిగ్రీ ప్రవేశ నిబంధనలు తీసుకొచ్చింది. ఒకేసారి రెండు డిగ్రీలు (డ్యూయల్ డిగ్రీలు dual degrees), పాలిటెక్నిక్(polytechnics), ఐటీఐ(ITI) వంటి నైపుణ్య ఆధారిత కోర్సులకు క్రెడిట్ ఇంటిగ్రేషన్ ఇవ్వనుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు బీఎస్సీ వంటి కోర్సులు ఏకకాలంలో చదివే అవకాశం కల్పిస్తోంది. ఇంజినీరింగ్ డ్రాపౌట్‌ (Engineering dropouts) లు కూడా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించనుంది.

    BRAOU | భవిష్యత్తు లక్ష్యం(Future goals)..

    రాబోయే దశాబ్దంలో తెలంగాణ(Telangana)లోని ప్రతి ఇంటికీ చేరువై.. నైపుణ్యం, ఉపాధి ఆధారిత విద్య(skill-based, employment-based education)ను అందరికీ అందించాలని BRAOU ఆశిస్తోంది.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...