అక్షరటుడే, వెబ్డెస్క్: Kingdom : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం కింగ్ డమ్. జులై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి Gautham Tinnanuri దర్శకత్వం వహించారు. ఈయన గతంలో మళ్ళీ రావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించారు. దీంతో తాజా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Kingdom : యాక్షన్ కోణం..
కింగ్డమ్ మూవీ Kingdom movie ని పూర్తిగా యాక్షన్ కోణంలో తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను ఇంతవరకు చూడని కోణంలో చూపించారు. ప్రేమ, కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తాజాగా.. యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా గుండెకు హత్తుకునేలా ఉండబోతున్నాయని టాక్.
Kingdom : కీలక పాత్రలో సత్యదేవ్..
నటుడు సత్యదేవ్ Actor Satyadev కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. విజయ్ దేవరకొండకు జతగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్డమ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం కింగ్డమ్ ట్రైలర్ హల్చల్ చేస్తోంది. ట్రైలర్లో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్ అభిమానులను మెప్పించింది.