అక్షరటుడే, హైదరాబాద్: teacher promotions : గవర్నమెంట్ టీచర్లకు తెలంగాణ సర్కారు Telangana government తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీచర్స్ ప్రమోషన్స్ ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy సంతకం చేశారు.
తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని SGT, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలోనే పదోన్నతులు లభించనున్నాయి. మరో రెండు రోజుల్లో రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సర్కారు తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 వేల మంది టీచర్లు ప్రమోషన్స్ పొందనున్నారు.
teacher promotions : టీచర్ల హర్షం..
టీచర్స్ ప్రమోషన్స్ అనేది దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న అంశం. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నోసార్లు పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఙతలు తెలుపుతున్నారు. కాగా, పదోన్నతులతో పలు చోట్ల టీచర్ పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటిని టీఆర్టీ TRT(డీఎస్సీ DSC) ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.