ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Tomcom | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఫిజీ దేశంలో ఉద్యోగ అవకాశాలు

    Tomcom | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఫిజీ దేశంలో ఉద్యోగ అవకాశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tomcom | నిరుద్యోగులకు టామ్​కామ్​ శుభవార్త చెప్పింది. ఫిజీ (Fiji) దేశంలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్​కామ్​) ఫిజీ దీవులలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

    ఎఫ్​ఎంసీజీ స్టోర్ మేనేజర్, ప్యానెల్ బీటర్, ఫోర్క్‌లిఫ్ట్ మెకానిక్, వాచ్ టెక్నీషియన్, బేకర్, పేస్ట్రీ బేకర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయన్ని టామ్​కామ్​ పేర్కొంది. కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 25 నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లను tomcom.resume@gmail.com కు పంపాలి. మరిన్ని వివరాల కోసం 9440052592, 9440048590, 9440051452 నంబర్లను సంప్రదించాలని టామ్​కామ్​ ఒక ప్రకటనలో తెలిపింది. http://tomcom.telangana.gov.in వెబ్​సైట్​లో కూడా పూర్తి వివరాలు ఉన్నట్లు పేర్కొంది.

    READ ALSO  MAT Notification | ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్​.. మ్యాట్ నోటిఫికేషన్​ విడుదల

    Tomcom | నిరుద్యోగులకు అండగా టామ్​కామ్​

    ఏజెంట్ల మాయలో పడి మోసపోకుండా టామ్​కామ్​ నిరుద్యోగులకు అండగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాల (Jobs in Foreign) కోసం నిరుద్యోగులను నేరుగా ఎంపిక చేస్తోంది. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకొని ఇంటర్వ్యూ ద్వారా జాబ్​లకు ఎంపిక చేస్తోంది. దీంతో ఏజెంట్ల మోసాలకు కొంత మేర చెక్​ పడింది. ఇటీవల జపాన్​లో ఉద్యోగాలకు (Jobs in Japan) సైతం టామ్​కామ్​ దరఖాస్తులు స్వీకరించింది.

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this