అక్షరటుడే నిజామాబాద్ సిటీ: District Judge | గ్రామ అభివృద్ధి కమిటీలు హద్దులు దాటితే చర్యలు తప్పవని జిల్లా జడ్జి జీవీఎన్ భరత లక్ష్మి (District Judge GVN Bharatha Lakshmi), సీపీ సాయి చైతన్య (Cp Sai chaitanya) హెచ్చరించారు. ఏర్గట్ల (Ergatla) మండలం తాళ్లరాంపూర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని గ్రామ అభివృద్ధి కమిటీలను ఉద్దేశించి ప్రసంగించారు.
District Judge | వీడీసీలు గ్రామాభివృద్ధికి సహకరించాలి..
వీడీసీ కమిటీలు హద్దులు దాటితే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని జిల్లా జడ్జి, సీపీ వ్యాఖ్యానించారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, వీడీసీలు గ్రామాభివృద్ధికి సహకరించాలని.. కానీ గ్రామంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించరాదని వివరించారు.
District Judge | పాస్‌పోర్టులు రద్దు చేస్తాం..
వీడీసీ సభ్యులు గ్రామాల్లో వేధింపులకు పాల్పడినట్లు తెలిస్తే వారి కుటుంబసభ్యులు ఎవరైనా విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. ముందుగా జిల్లా జడ్జి, సీపీలు ఎస్సీ, మాల, గౌడ సంఘాల అభివృద్ధి కమిటీల కారణంగా బహిష్కరింపబడ్డ వారి సమస్యలను విన్నారు. కార్యక్రమంలో జ్యూడీషియల్ ఆఫీసర్ ఆర్మూర్ ఉదయ్ భాస్కరరావు, నిజామాబాద్ స్టేట్ బార్ కౌన్సిల్ రాజేందర్ రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి, సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.