అక్షరటుడే, బాన్సువాడ: Sub Collector Kiranmai | ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేయవద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మాతా శిశు ఆస్పత్రిలో (Maternal and Child Hospital) శనివారం డివిజన్ పరిధిలోని ఆర్ఎంపీ(RMP), పీఎంపీలతో (PMP) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్లినిక్లకు వచ్చే రోగులకు ఫస్ట్ ఎయిడ్ (First Aid) మాత్రమే చేయాలని, యాంటీబయటిక్స్(Antibiotics), ఇతర హైడోస్ మందులు ఇవ్వొద్దని హెచ్చరించారు. మలేరియా(Malaria), డెంగీ(dengue), పోలియో కేసులు (Polio cases) వస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పరిమితికి లోబడి వైద్యం అందించాలని, రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ అశోక్, వైద్యులు రోహిత్, సీహెచ్వో దయానంద్ తదితరులు పాల్గొన్నారు.