ePaper
More
    HomeజాతీయంMumbai-Pune Express Highway | వరుసగా ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు దుర్మరణం

    Mumbai-Pune Express Highway | వరుసగా ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mumbai-Pune Express Highway | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేపై (Mumbai-Pune Express Highway) శనివారం వరుసగా 20 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ తాలూకా ఖోపోలి పోలీస్ స్టేషన్ (Khopoli police station) పరిధిలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం మధ్యాహ్నం వాహనాలు ఢీకొన్నాయి. అడోషి టన్నెల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బ్రేక్ ఫెయిల్ తర్వాత ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    Mumbai-Pune Express Highway | భారీగా ట్రాఫిక్​ జామ్

    కంటైనర్​ డ్రైవర్​ నియంత్రణ కోల్పోయి వాహనాలను ఢీకొన్నాడు. ఈ క్రమంలో ​వాహనాలు ఒక దానిని ఒకటి ఢీకొన్నాయి. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హైవే భారీగా ట్రాఫిక్​ జామ్​ (massive traffic jam) అయింది. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు.

    READ ALSO  Malegaon Blasts | మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితుల‌కు క్లీన్‌చిట్‌.. ఏ మ‌తం ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌దన్న కోర్టు

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this