Padi Kaushik Reddy
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు

అక్షరటుడే, కామారెడ్డి: Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డిపై (CM revanth reddy) అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (Huzurabad MLA Padi Kaushik Reddy) కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఎన్ఎస్​యూఐ (NSUI) జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ మాట్లాడుతూ.. మహిళల ఓట్లపై గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి అదే మహిళలపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

Padi Kaushik Reddy | సాక్ష్యాలు చూపించాలి..

పాడి కౌశిక్​ రెడ్డి ఎవరి మన్ననల కోసమో నీచమైన ఆరోపణలు చేయడం కాదని, సాక్ష్యాలు చూపెట్టాలని కాంగ్రెస్​ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS) నాయకులే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులని, వారు జైలుకు వెళ్లే సమయం దగ్గరకు వచ్చిందని.. దీంతో కౌశిక్ రెడ్డి ద్వారా రివర్స్ గేమ్ మొదలుపెట్టారన్నారు. హుజూరాబాద్​లో ఎమ్మెల్యే పదవి వదిలేసి హైదరాబాద్​లో (Hyderabad) కేసీఆర్​ కుటుంబానికి వాచ్​మెన్​ పనిచేస్తున్నావా? అని ప్రశ్నించారు. ఆధారాలు లేని మాటలు మాట్లాడితే బయట తిరగనివ్వమని హెచ్చరించారు.

వార్తల్లో తనపేరు ఉండడం కోసం ఇంటివాళ్లను కూడా ఫోన్ టాపింగ్​లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీను, పంపరి లక్ష్మణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుట్నాల శ్రీను, రాజా గౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, కన్నయ్య, తేజపు ప్రసాద్, బట్టు మోహన్ తదితరులు పాల్గొన్నారు.