ePaper
More
    HomeతెలంగాణTeachers MLC Sripal Reddy | జిల్లా విద్యాభివృద్ధికి సమిష్టి కృషి

    Teachers MLC Sripal Reddy | జిల్లా విద్యాభివృద్ధికి సమిష్టి కృషి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Teachers MLC Sripal Reddy | జిల్లా విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, అధికారులు సమిష్టి కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన శనివారం విద్యాశాఖ కార్యాలయాన్ని (education department office) సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు ఎన్​రోల్​మెంట్​ ఎంత జరిగింది, పాఠశాలలకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా తదితర విషయాలను డీఈవోను (DEO Ashok) అడిగి తెలుసుకున్నారు.

    అలాగే ఈనెల 29న నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలను 30వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. ఆ రోజున నాగుల పంచమి (Nagula Panchami) కారణంగా తరువాత రోజు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ వెంట మాజీ ఎమ్మెల్సీ భట్టాపురం మోహన్ రెడ్డి (former MLC Bhattapuram Mohan Reddy) జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

    అనంతరం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​లో నిర్వహించిన రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం భట్టాపురం సత్యం రెడ్డి ద్వాదశ దినకర్మకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు. పీఆర్​టీయూలో సత్యం రెడ్డి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, సంఘ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేశారన్నారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this