అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | మాజీ మహిళా సర్పంచ్ (Former female sarpanch) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమ్గల్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ (Bheemgal SI Sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జోరా (Bejjora) తాజా మాజీ సర్పంచ్ కోగూరు ప్రతిభ కొంత కాలంగా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు
జిల్లాలో ఇటీవల పెరుగుతున్న ఆత్మహత్య ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కొందరు, మానసిక, ఆరోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కారణం ఏదైనా క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని.. చనిపోయే ముందుకు ఒక్క క్షణం ఆలోచించి.. ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.