ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​GGH Nizamabad | జీజీహెచ్​లో నెలలోపు మరమ్మతులు పూర్తవ్వాలి: ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

    GGH Nizamabad | జీజీహెచ్​లో నెలలోపు మరమ్మతులు పూర్తవ్వాలి: ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: GGH Nizamabad | నిజామాబాద్​ జిల్లా జనరల్ ఆస్పత్రిలో (GGH) మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి (Mla sudharashan reddy) పేర్కొన్నారు. ఆయన శనివారం ఆస్పత్రిని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీజీహెచ్​లో డ్రెయినేజీ వ్యవస్థ, టాయిలెట్లు చక్కదిద్దాలన్నారు. లీకేజీలను అరికట్టాలని, ఫ్లోరింగ్, ఆస్పత్రి ముందు భాగంలో కిటికీలు తదితర మరమ్మతులు నెలలోపు పూర్తి చేయాలని ఆస్పత్రి ఇంజినీరింగ్​ విభాగ అధికారులను ఆదేశించారు.

    GGH Nizamabad | వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలి

    ఆస్పత్రిలో వైద్యసేవలను మరింతగా మెరుగుపర్చాలని.. అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం 180 మంది వైద్యులు, సరిపడా సిబ్బందితోపాటు అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మేజర్, మైనర్ సర్జరీలతో పాటు షుగర్, బీపీ, డెంగీ, మలేరియా, థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారని వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.వేలల్లో వృథా చేసుకోవద్దన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పోలిస్తే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నిపుణులైన వైద్యులు, వారికి అనుబంధంగా మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు.

    GGH Nizamabad | కీలు మార్పిడి శస్త్రచికిత్స

    రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జీజీహెచ్​లో కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం అభినందనీయమని సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. డెంటల్ విభాగం ఆధ్వర్యంలో సర్జరీలను కూడా చేస్తున్నారని తెలిపారు. ఆస్పత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధుల మంజూరు చేయిస్తానని చెప్పారు. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఆస్పత్రి కావడంతో నిర్వహణపరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

    GGH Nizamabad | మాతాశిశు కేంద్రాన్ని వినియోగంలోకి తెస్తాం

    జీజీహెచ్ ముందు ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం (Maternal and Child Health Center), క్రిటికల్ కేర్ యూనిట్లను (Critical care units) ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరలోనే భవనాన్ని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. అలాగే బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నెలకొన్న ఇబ్బందులను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్​బిన్​ హందాన్​, నుడా ఛైర్మన్ (NUDA) కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ (District Library Association) ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్​ శ్రీనివాస్​ తదితరులున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...