ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Heavy Rains | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఇబ్బంది పడుతున్న నగరవాసులు

    Heavy Rains | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఇబ్బంది పడుతున్న నగరవాసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో భారీ వర్షం పడుతోంది. శనివారం ఉదయం నుంచే వర్షం పడుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (LPA) ఉపరితల ఆవర్తన ద్రోణిగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

    హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వరుణుడు తాన ప్రతాపం చూపుతున్నాడు. తెరిపినివ్వకుండా వాన (Rain) పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

    Heavy Rains | జలమయమైన రోడ్లు

    వర్షాలతో నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో వర్షం పడడంతోనే నగరవాసులు ట్రాఫిక్​లో నరకం చూశారు. సాయంత్రం మళ్లీ భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  Hyderabad | వెళ్లిపోయిన పెళ్ళాన్ని తెచ్చుకుంటే.. ప్రాణాలు తీయాలని చూసింది..

    Heavy Rains | సహాయక చర్యలు

    నగరంలో భారీ వర్షం పడుతుండడంతో ట్రాఫిక్​ పోలీసులు, హైడ్రా (Hydraa), జీహెచ్​ఎంసీ (GHMC) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్​ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అలాగే నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్​ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

    Heavy Rains | జలాశయాలకు నీరు

    నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్​లోని జంట జలాశయాలు అయిన ఉస్మాన్​సాగర్ (Usman Sagar) ​(గండిపేట), హిమాయత్​ సాగర్ (Himayath Sagar)​కు భారీగా వరద వస్తోంది. నగర వాసులకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్​లు జలకళను సంతరించుకున్నాయి. హిమాయత్​ సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుతం 1761 అడుగులకు చేరింది. ఉస్మాన్​ సాగర్​ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1782 అడుగులకు నీరు చేరింది. దీంతో త్వరలోనే రెండు జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది.

    READ ALSO  GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    Latest articles

    Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది(Krishna River) పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని...

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    More like this