అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | నిజామాబాద్ జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. అలాగే వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. భారీ వర్షాలకు సిర్నాపల్లి జానకీబాయి చెరువు నీటి కళకళలాడుతోంది. దీంతో చెరువు అలుగు పారుతోంది.
ఇందూరు నయాగరాగా (Induru nayagara) పేరొందిన ఈ సిర్నాపల్లి జలపాతానికి (Sirpapalli Waterfall) పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు సిర్నాపల్లి చెరువు అలుగు వద్దకు ప్రతి ఏడాది పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు.
జలకళను సంతరించుకున్న ఇందూరు నయాగరా.. అలుగు పారుతున్న సిర్నాపల్లి చెరువు#sirnapally #nizamabad #waterfall #waterfalls #nature pic.twitter.com/3lu6UvusLk
— Akshara Today (@aksharatoday) July 26, 2025