RTC Bus
RTC Bus | కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: RTC Bus | ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్​ (Makloor) మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్​ ఎస్సై రాజశేఖర్ (Makloor SI Rajasekhar)​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) నుంచి వరంగల్(Warangal) వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్​నగర్​ (Das nagar) వద్ద ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాక్లూర్​ మండల కేంద్రానికి చెందిన షేక్ మహమ్మదీ (52) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మహమ్మదీ కొడుకు, కోడలు, కూతురికి గాయాలయ్యాయి. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త షేక్ బషీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.