అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (Special Police Officer) పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. హైదరాబాద్ (Hyderabad) నగరం పరిధిలో 116 పోస్టులను తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేయనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన మాజీ సైనికులు, పారా మిలటరీ సిబ్బంది, రిటైర్డ్ పోలీసులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మాజీ సైనికులకు 01-08-2025 నాటికి 58 ఏళ్లలోపు ఉండాలి. గత రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ పొందిన పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి, గరిష్ట వయోపరిమితి 61 ఏళ్లు. తెలంగాణకు చెందిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికోసం తెలంగాణలో నివాస రుజువు (ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్) కలిగి ఉండాలి.
Hyderabad | వేతనం వివరాలు..
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 5లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలను నేరుగా హైదరాబాద్ నగరంలోని ప్లేట్లబుర్జులో గల సిటీ ఆర్మ్డ్, రిజర్వ్డ్ పోలీసు కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతం ఇస్తారు. ఎలాంటి వేతన సెలవులు ఉండవు. ఒకవేళ విధులకు రాకపోతే జీతం కట్ చేస్తారు. గతంలో పని చేసిన డిశ్చార్జ్/రిటైర్మెంట్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్, టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికేట్ (వర్తిస్తే), డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్ పోస్టులకు), 3 పాస్పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి.