అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ పట్టణంలో ఈనెల 27న (ఆదివారం) నిర్వహించనున్న మాలల ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది. సమ్మేళనంను వాయిదా వేస్తున్నట్లు మాల సంఘం తెలంగాణ వ్యవస్థపాకుడు అయ్యాల సంతోష్, డివిజన్ అధ్యక్షుడు మిర్జాపురం సాయన్న తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంఘం సభ్యుల కోరిక మేరకు వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. తదుపరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమాన్ని వాయిదా వేసిన విషయాన్ని మాల సంఘ నాయకులు గమనించాలని వారు కోరారు.