అక్షరటుడే, ఇందూరు: Kargil War | దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachari) అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) పురస్కరించుకొని శనివారం ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26 సంవత్సరాల క్రితం దేశ సైనికులు ఎనలేని పోరాటం చేశారన్నారు. వారి త్యాగాలను జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Kargil Vijay Diwas | కార్గిల్ యుద్ధంలో..
1999లో కార్గిల్ యుద్ధం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. 527 మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టిందన్నారు. కార్యక్రమంలో నాయకులు న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, శ్రీధర్, బొట్టు వెంకటేష్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.