Bihar CM
Bihar CM | బీహార్‌లో కొన‌సాగుతున్న వ‌రాల జ‌ల్లు.. జ‌ర్న‌లిస్టుల పెన్ష‌న్‌ను పెంచిన సీఎం నితీశ్‌

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar CM | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (Bihar Assembly elections) ముహూర్తం స‌మీపిస్తున్న త‌రుణంలో అక్క‌డి ప్ర‌జ‌లై వ‌రాల జ‌ల్లు కురుస్తోంది. ఇప్ప‌టికే మ‌హిళ‌లు, యువ‌త‌కు తాయిలాలు ప్ర‌క‌టించిన బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) శ‌నివారం తాజాగా జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త చెప్పారు.

‘బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం’ (Bihar Patrakar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ. 15,000 పెన్ష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. గతంలో ఇది రూ. 6 వేలు ఉండ‌గా, ఇప్పుడు దాన్ని రూ.15 వేల‌కు పెంచ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, అత‌డి వ్యక్తి భార్యకు నెలకు రూ. 10 వేల‌చొప్పున జీవితకాల పెన్షన్ లభిస్తుంది. ఇలాంటి వారికి గతంలో రూ. 3 వేలు మాత్ర‌మే ఇచ్చే వారు.

Bihar CM | జర్నలిస్టులది కీల‌క పాత్ర

సమాజంలో జర్నలిస్టులది కీల‌క పాత్ర అని సీఎం నితీశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత గౌరవంగా జీవించగలిగేలా తాము మొదటి నుండి జర్నలిస్టులకు సౌకర్యాలను క‌ల్పిస్తున్నామ‌న్నారు. “బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హులైన జర్నలిస్టులందరికీ (journalists) ఇస్తున్న రూ.6 వేల పెన్ష‌న్‌ను రూ.15 వేల చొప్పున అందించాల‌ని సంబంధిత శాఖకు సూచనలు ఇచ్చామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదనంగా, ‘బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం’ కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్టులు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి జీవితాంతం రూ.3,000కి బదులుగా రూ.10,000 నెలవారీ పెన్షన్ (monthly pension) అందించాలని నిర్ణ‌యించామ‌ని” ముఖ్యమంత్రి నితీష్ Xలో పోస్ట్ చేశారు.

Bihar CM | ఎన్నిక‌ల్లో గెలుపు కోసం..

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని నితీశ్‌కుమార్ యోచిస్తున్నారు. అందుకే ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తాయిలాలు వెద‌జ‌ల్లుతున్నారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, వితంతువు మహిళలకు నెలవారీ పెన్షన్లను రూ.400 నుండి రూ.1100కి పెంచారు. అలాగే, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను (free electricity) ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో కోటి మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.