అక్షరటుడే, భీమ్‌గల్ : Kammarpalli | కమ్మర్పల్లి (Kammarpalli) మండలం కోనాపూర్ గ్రామ శివారులోని రాళ్లవాగు (Rallavagu) చెక్ డ్యాంను పరిశీలించేందుకు వెళ్లిన ఏఈఈ నితిన్ (AEE Nithin) గుండెపోటుతో మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోనాపూర్‌లోని రాళ్ల వాగు చెక్కు డ్యాములో నీటి లెవెల్స్ తీసేందుకు తోటి సిబ్బందితో కలిసి నితిన్ శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో నీటిమట్టం పరిశీలిస్తుండగా.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అనిల్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Kammarpalli | నెల క్రితమే వివాహం
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన నితిన్ 2024 అక్టోబర్‌లో ఏఈఈగా ఉద్యోగం సాధించాడు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన ఏడాది కూడా విధులు నిర్వహించకుండానే ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. నితిన్‌కు నెల క్రితమే వివాహం జరగడం గమనార్హం. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆయనను మృత్యువు గుండెపోటు రూపంలో బలి తీసుకుంది.