అక్షరటుడే, వెబ్‌డెస్క్: JNTU | విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తారు. ఫెయిల్ అయితే తీవ్ర మనస్తాపానికి గురవుతారు. బాగా చదివి కూడా పాస్ కాలేకపోతే ఆత్మన్యూనత భావనకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరీక్షల జవాబు పత్రాలను ఎంతో శ్రద్ధగా మూల్యాంకనం చేయాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు బ్యాక్‌లాగ్‌లు ఉంటే.. క్యాంపస్ ప్లేస్మెంట్ సమయంలో రిమార్క్ అవుతుంది. అలాంటిది ఓ ప్రొఫెసర్ నిర్లక్ష్యంగా పేపర్ వాల్యూయేషన్ చేయడంతో ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అధికారులు తప్పును సరిదిద్దడంతో వారు తిరిగి పాస్ అయ్యారు.
జవాబుపత్రాలు దిద్దడంలో ప్రొఫెసర్ Professor చేసిన తలతిక్క పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఓ విద్యార్థి విజ్ఞతతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి సరి చేశారు. ఫలితంగా ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. వివరాలలోకి వెళితే ..గత నెలలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) Jawaharlal Nehru Technological University (JNTU) లో నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ – EIA అనే సబ్జెక్టు పరీక్ష జరిగింది. మల్లారెడ్డి (Mallareddy), షాదాన్, శ్రీదత్త కళాశాలలకు చెందిన సుమారు 138 మంది విద్యార్థులు ఈ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు.
JNTU | ఎంత పని జరిగింది..
అయితే, శ్రీదత్త కళాశాల (Sridatta College) కు చెందిన ఓ విద్యార్థి ఈ ఫలితంపై అనుమానంతో యూనివర్సిటీ పరీక్షల విభాగానికి మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఎక్కువ మంది ఫెయిల్ కావడంలో తప్పిదం ఉండొచ్చని భావించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. పరిశీలనలో, ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన EIA పరీక్షల్లో, ఒకే ప్రశ్నా పత్రం ఆధారంగా రెండు సెషన్ల జవాబుపత్రాలను దిద్దినట్టు గుర్తించారు. ఉదయం ప్రశ్నపత్రంతో సాయంత్రం సెషన్ జవాబు పత్రాలను దిద్దిన ప్రొఫెసర్ పెద్ద పొరపాటు చేశాడు.
వెంటనే సంబంధిత సెషన్ ప్రశ్నపత్రాలతో జవాబులను మళ్లీ పరిశీలించగా ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు తేలింది. గురువారం రాత్రి యూనివర్సిటీ University సవరించిన ఫలితాలను విడుదల చేసింది.ఈ ఘటన విద్యార్థుల భవిష్యత్తుపై ఎంతగా ప్రభావం చూపగలదో తెలియజేస్తూ, పరీక్షల విధానంలో మరింత జాగ్రత్త అవసరమని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.